- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డోంట్ వర్రీ.. ‘ఇండియా’ కూటమిపై నితీశ్ కీలక కామెంట్
దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష కూటమి ఇండియాలో సీట్ల పంపకాల చర్చలపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంగారుపడాల్సిన పనేం లేదని.. అంతా అనుకున్న టైంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతాయని తేల్చి చెప్పారు. దేశంలో ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న తరుణంలో నితీష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నితీష్‌కు చెందిన జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ప్రతినిధులు ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌తో భేటీ అయి సీట్ల పంపకాలపై చర్చించారు. కాగా, త్వరలోనే ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీష్ పేరును అనౌన్స్ చేస్తారనే వార్తలు వినవస్తున్నాయి.
#WATCH | On seat-sharing for Lok Sabha elections in INDIA Alliance, Bihar CM Nitish Kumar says, "Everything will be done on time, don't worry." pic.twitter.com/2kp5UsJnac
— ANI (@ANI) January 11, 2024