మోడీని ఇంటికి పంపే వరకు నిద్రపోము: డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్

by samatah |
మోడీని ఇంటికి పంపే వరకు నిద్రపోము: డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీని, బీజేపీని ఇంటికి పంపే వరకు ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నిద్రపోదని ఆ పార్టీ నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. తిరువనమలై జిల్లాలో మంగళవారం నిర్వహించిన ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. డీఎంకేకు నిద్రపట్టడం లేదని ఇటీవల తమిళనాడు పర్యటన సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు. మోడీని ఇంటికి పంపే వరకు నిజంగానే డీఎంకే నిద్రపోదని తెలిపారు. ‘2014లో గ్యాస్ సిలిండర్ రూ.450 ఉండేది. కానీ ఇప్పుడు రూ.1200 ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ముందు డ్రామా చేసి రూ.100 తగ్గించారు. ఎలక్షన్స్ తర్వాత మళ్లీ రూ.500 పెంచడం ఖాయం’ అని విమర్శించారు. ‘తమిళనాడు రాష్ట్రం తుపాను బారిన పడితే కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేసినప్పటికీ నిధులు ఇవ్వలేదు’ అని చెప్పారు. తమిళనాడులోని అన్ని స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story