America President: అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తా : డొనాల్డ్ ట్రంప్

by Rani Yarlagadda |
America President: అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తా : డొనాల్డ్ ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (America President Elections) రిపబ్లికన్ పార్టీ (Republican Party) , డెమోక్రటిక్ పార్టీల (Democratic Party) మధ్య ప్రధాన పోటీ జరగ్గా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ట్రంప్ (Donald Trump) ఎన్నిక ఖాయమైంది. మ్యాజిక్ ఫిగర్ 270కి చేరువలో ఉన్నారాయన. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోపన్యాసంలో ట్రంప్ తన విజయంపై ప్రసంగించారు. తన జీవితంలో ఇలాంటి క్షణాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. తమ గెలుపుతో అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయన్నారు. అమెరికా ప్రజలు ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదన్నారు ట్రంప్.

అమెరికాకు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తానన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. స్వింగ్ రాష్ట్రాల్లో తాను ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఎలక్టోరల్ ఓట్లు కూడా 315కు పైగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్. పాపులర్ ఓట్లలోనూ తనదే విజయమన్నారు. తన విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సెనెట్ తో పాటు కాంగ్రెస్ లోనూ తమకే ఆధిక్యం ఉందని పేర్కొన్నారు. దేశంలో కొత్త చట్టాలను తీసుకురావడానికి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తామని ట్రంప్ తెలిపారు.

ప్రస్తుతం 25 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్, 18 రాష్ట్రాల్లో కమలా హారిస్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు 267 స్థానాల్లో, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు 214 స్థానాల్లో విజయం సాధించారు.

Advertisement

Next Story

Most Viewed