- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ratan TaTa : రతన్ టాటాకు రహస్య జీవితం ఉందా? వీలునామాలో బయటపడ్డ సంచలన నిజాలు

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ టాటా గ్రూప్(TaTa Groups) దిగ్గజం స్వర్గీయ రతన్ టాటా(Ratan TaTa) మరోసారి సంచలన వార్తల్లో నిలిచారు. తన వీలునామా('WILL')లో ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని చేర్చడమే దానికి కారణం. ఈ వ్యవహారం టాటా గ్రూప్ ను మాత్రమే కాకుండా.. మొత్తం వ్యాపార ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. ఇంతకీ ఆ సీక్రెట్ వ్యక్తి(Secret Person) ఎవరు? రతన్ టాటాతో ఆ వ్యక్తికి ఉన్న బంధం ఏమిటి? ఎందుకు ఆ వ్యక్తి పేరు తన వీలునామాలో చేర్చారు లాంటి తదితర రహస్య వివరాలు ఇపుడు తెలుసుకుందాం.
మోహిని మోహన్ దత్తా..
టాటా గ్రూప్ దిగ్గజం రతన్ టాటా తన వీలునామాలో చేర్చిన వ్యక్తి.. జంషెడ్‌పూర్‌కు చెందిన వ్యవస్థాపకుడు మోహిని మోహన్ దత్తా(Mohini Mohan Dutta). దత్తా తన కెరీర్‌ను తాజ్ గ్రూప్(Taj Group)తో ప్రారంభించారు. ఆ తర్వాత తన సొంత వెంచర్ స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ(Stallion Travel Agency)ని ప్రారంభించారు. 2013లో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ విభాగమైన తాజ్ సర్వీసెస్‌తో విలీనం అయ్యింది. దాంతో ఈ వ్యాపారంలో 80శాతం వాటాను కలిగి ఉన్నారు. మిగిలినది టాటా ఇండస్ట్రీస్ వద్ద ఉంది. ఆ ఏజెన్సీ తరువాత తాజ్ ట్రావెల్ డివిజన్‌లో విలీనం అయింది. ఆ తరువాత దీనిని టాటా క్యాపిటల్ కొనుగోలు చేసింది. ఆ తరువాత థామస్ కుక్ కు అమ్మేశారు. ఇప్పుడు టీసీ ట్రావెల్ సర్వీసెస్‌గా పనిచేస్తున్న దత్తా డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు టాటా గ్రూప్ కంపెనీలలో వాటాలు ఉండటం మాత్రమే కాదు.. వాటిలో త్వరలో లిస్టెడ్ కాబోయే టాటా క్యాపిటల్ కూడా ఉంది. ప్రస్తుతం 80 ఏళ్లు పైబడిన మోహిని మోహన్ దత్తా.. 1960లలో మొదటిసారి రతన్ టాటాను కలిశారు. ఆ సమయంలో, 24 ఏళ్ల వయస్సులో టాటా తన టాటా స్టీల్‌లో పనిచేశాడు. 2024 అక్టోబర్‌లో టాటా అంత్యక్రియల సందర్భంగా దత్తా ఆయనను గుర్తుచేసుకున్నారు. “మేం మొదట జంషెడ్‌పూర్‌లోని డీలర్స్ హాస్టల్‌లో కలిశాం. అప్పుడు రతన్ టాటా వయసు కేవలం 24 సంవత్సరాలు. ఆయన నాకు ఎంతో సాయం చేసి ఇంత వాడిని చేశారు” అని గతంలో దత్తా మీడియాతో అన్నారు. ఈ తొలి పరిచయం రతన్ టాటా, మోహిని మోహన్ దత్తా ఇద్దరి మధ్య ఆత్మీయ అనుబంధంగా మారింది.
అసలు వీలునామాలో ఏముందీ..
టాటా మరణించిన దాదాపు రెండు వారాల తర్వాత ఆయన వీలునామాను బహిరంగంగా ఉంచారు. ఈ వీలునామాలో ఆయన సోదరుడు, సవతి సోదరీమణులు, నమ్మకంగా పనిచేసే ఇంటి సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శాంతను నాయుడు వంటి అనేక మంది లబ్ధిదారులకు సంపదను కేటాయించారు. అయితే ముఖ్యంగా తన ఆస్తులలో దాదాపు మూడింట ఒక వంతును దత్తా కోసం వదిలి వెళ్ళాడు. అక్టోబర్ 9, 2024న మరణించిన రతన్ టాటా.. రూ. 500 కోట్ల విలువైన ఆస్తులను మోహిని మోహన్ దత్తాకు అప్పగించారని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. వాస్తవానికి, టాటా సంపదకు దత్తాను వారసులలో ఒకరిగా వీలునామాలో పేర్కొన్నప్పటికీ, అది ప్రొబేట్ చేయించుకుని హైకోర్టు ధృవీకరించిన తర్వాత మాత్రమే పంపిణీ చేసే వీలుంది. దీనికి కనీసం 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అదే విధంగా తన పెంపుడు కుక్క టిటోకు అపరిమిత సంరక్షణ ఉండేలా టాటా అనేక నిబంధనలు కూడా చేశారు. టాటా సన్స్‌లోని వాటాలను రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్‌కు బదిలీ చేశారు. తన ఆస్తులలో అలీబాగ్‌లోని బీచ్ బంగ్లా, జుహులో రెండంతస్తుల ఇల్లు, రూ.350 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టాటా సన్స్‌లో వాటా ఉన్నాయి.
ప్రపంచానికి తెలియని రతన్- దత్తా స్నేహబంధం
రతన్ టాటా తన వీలునామాలో దత్తా పేరు కనిపించే ముందు ఆయన గురించి ఎవరికి తెలియదు. కానీ ఆ వ్యవస్థాపకుడు ఎల్లప్పుడూ తన కుటుంబానికి దగ్గరగా ఉండేవాడని టాటా గ్రూప్ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. టాటాతో దాదాపు 6 దశాబ్దాల అనుబంధం ఉందని భావిస్తున్న దత్తా.. డిసెంబర్ 2024లో ముంబైలోని (NCPA)లో జరిగిన రతన్ టాటా జయంతి వేడుకలకు ఆహ్వానితులుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఫార్చ్యూన్‌లో నివేదిక ప్రకారం.. దత్తా కుమార్తె కూడా వారితో కలిసి పనిచేసింది. మొదట 2015 వరకు తాజ్ హోటల్స్‌లో పనిచేయగా ఆ తరువాత 2024 వరకు టాటా ట్రస్ట్స్‌లో పనిచేసింది.