- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పద్మవిభూషణ్ అందుకున్న తొలి మహిళ ఎవరో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం పలు రంగాల్లో సేవలందిన వారికి 'పద్మ' పురస్కారాలను అందించింది. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో పలువురు స్త్రీలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా దేశ రెండో అత్యున్నత పురస్కారం 'పద్మ విభూషణ్'ని అందుకున్న తొలి మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌కు చెందిన జానకీదేవి బజాజ్ మన దేశంలో పద్మ విభూషణ్ అందుకున్న తొలి మహిళగా నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని ధనిక మార్వాడీ కుటుంబంలో జన్మించారు. మహారాష్ట్రలోని మరో సంపన్న కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టారు. జానకీకి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే 12 ఏళ్ల జమ్నాలాల్ బజాజ్‌తో పెళ్లయ్యింది. పెళ్లి అయినా కొన్నాళ్లకు భర్త జమ్నాలాల్జీ సాధువుగా మారాలనుకున్నాడు. అప్పటికి ఆవిడ వయసు కేవలం 14 ఏళ్లే. కానీ, భర్తతోపాటు తానూ కఠిన నియమాలతో కూడిన సాధు జీవితాన్ని అలవాటు చేసుకున్నారు.
దేశం కోసం అన్నీ వదులుకుని కుటుంబంతో సహా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1921లో గాంధీ స్ఫూర్తితో జానకీదేవి బజాజ్ ఇంటి లోపల.. వెలుపల వాడుతున్న విదేశీ దుస్తులను తగలబెట్టారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుశిక్ష కూడా అనుభవించారు. మహిళల సంక్షేమంతోపాటు నిమ్న వర్గాల అభ్యున్నతికీ, దేవాలయాల్లోకి వాళ్లకూ ప్రవేశం కల్పించేందుకు కృషి చేయడం, గో సంరక్షణ వంటి కార్యక్రమాలెన్నో చేపట్టారు. ఆచార్య వినోబా భావేతో కలిసి భూదాన్ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఈ కృషికే 1956లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మవిభూషణ్‌ను అందజేసింది. ఆమె 'మేరీ జీవన్ యాత్ర' పేరుతో ఆత్మకథను కూడా రాసుకున్నారు.