- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మన దేశంలో బడ్జెట్‌ను ఎవరు, ఎలా రూపొందిస్తారో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్‌ను (Union Budget 2025) ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కి వరుసగా 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక ప్రతి ఒక్క దేశ బడ్జెట్ ప్రక్రియ దాని ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది. మన దేశంలో ప్రతి సంత్సవరం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతారు. ఈ సందర్భంగా అసలు బడ్జెట్ ఎలా రూపొందిస్తారు? ఎప్పటి నుంచి బడ్జెట్ రూపొందించటం మొదలైంది? బడ్జెట్ గురించి రాజ్యాంగం ఏమి చెబుతుంది? దానిని సమర్పించడానికి ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బడ్జెట్ ఎప్పటి నుంచి మొదలైందంటే?
బడ్జెట్ అనే పదం లాటిన్ పదం 'బుల్గా' నుండి వచ్చింది. ఫ్రెంచ్ భాషలో దీనిని బుగెట్ అని కూడా అంటారు. ఇంగ్లీష్‌లో పిలిచినప్పుడు అది బోగెట్‌గా మారింది. తర్వతర్వాత ఆ పదాన్నే బడ్జెట్ అని పిలుస్తున్నారు. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు దీనిని ఆమోదించాయి. ప్రపంచ దేశాల్లో ముందుగా 1760 సంవత్సరంలో ఇంగ్లాండ్ ఆ దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అక్కడి నుంచే మొదలైంది. ఇక భారతదేశంలో బడ్జెట్ బ్రిటీష్ కాలంలో ప్రారంభమైంది. 1857 తిరుగుబాటు తరువాత, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి బ్రిటిష్ వారు ఏప్రిల్ 7, 1860న భారతదేశం మొదటి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం అనంతరం మాట్లాడుకుంటే అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ అంటే ఏంటి?
రాజ్యాంగంలో బడ్జెట్ గురించి నేరుగా ప్రస్తావించలేదు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్‌ను దేశ వార్షిక ఆర్థిక నివేదికగా సమర్పిస్తారు. ఈ ఆర్టికల్ కింద, ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన ఆదాయాలు, ఖర్చుల లెక్కలను అందించడం తప్పనిసరి. బడ్జెట్‌లో ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లోటు, రాబడి అంచనాలు, సబ్సిడీలు, పన్ను విధానాలు ఇంకా ప్రణాళికలు ఉంటాయి. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఇక బడ్జెట్‌ను రెవెన్యూ బడ్జెట్ అలాగే కాపిటల్ బడ్జెట్ రెండు భాగాలుగా విభజించారు. బడ్జెట్ సమయంలో 'జనరల్ బడ్జెట్' ఇంకా 'రైల్వే బడ్జెట్' ఒకేసారి ప్రవేశపెడతారు. అయితే అంతకుముందు రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా సమర్పించేవారు.
బడ్జెట్‌ను ఎవరు రూపొందిస్తారు?
బడ్జెట్‌ను ఒక్క రోజులో ప్రవేశపెట్టినప్పటికీ దీన్ని తయారీ ప్రక్రియ సంవత్సరం మధ్యలోనే ప్రారంభమవుతుంది. ఇందుకు ఆర్థిక శాఖతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు ఇంకా ఆర్థిక సంస్థల నుండి సూచనలు తీసుకుంటారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇంకా ఆర్థిక మంత్రిత్వ శాఖ సమ్మతితో తుది ముసాయిదా తయారు చేస్తారు.
ఇక రేపు నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై దేశంలోని మధ్య తరగతి ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం సమయంలో వారు బడ్జెట్ నుండి పెద్ద ఉపశమనాన్ని ఆశిస్తున్నారు.