భారతదేశంలో దొంగతనం జరగని గ్రామం ఎక్కడ ఉందో తెలుసా?

by Sathputhe Rajesh |
భారతదేశంలో దొంగతనం జరగని గ్రామం ఎక్కడ ఉందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ వార్తల్లో ఏదో ఓ గ్రామంలో దొంగతనం జరిగిన ఘటనలను తరచూ చూస్తూ ఉంటాం. దొంగలు సైతం కొత్తకొత్త పద్దతుల్లో అందిన కాడికి దోచుకుపోతుంటారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు భారీ స్కెచ్ వేసి మరి దోచుకుపోతారు. ఇక తాళం వేసిన ఇళ్లు కనబడితే గుల్ల చేస్తుంటారు. కానీ ఓ గ్రామంలో ఇప్పటి వరకు ఇళ్లకు తలుపులు లేక పోవడం విశేషం. ఆ గ్రామంలో బ్యాంకులకు తాళాలు ఉండవు. భారతదేశంలోని ఈ ప్రత్యేకమైన గ్రామం మహారాష్ట్రలో ఉంది.

ఈ గ్రామం పేరు శని శింగనాపూర్. ఈ గ్రామంలో శనిదేవుడు కొలువై ఉన్నాడు. దీంతో తమ గ్రామాన్ని శనిదేవుడే కాపాడుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులు ఉండవు. ఇక్కడి దుకాణాలు, బ్యాంకులకు తాళాలు ఉండవు. శనిదేవుడు తమ కుటుంబాలను, తమ ఇళ్లను రక్షిస్తాడని ఆ గ్రామస్తులు బలంగా నమ్ముతారు. ఈ నమ్మకం కారణంగానే నేటికి ఆ గ్రామంలో ఒక్క చోరీ జరిగిన దాఖలాలు లేవు.

ఈ విషయాన్ని స్థానికులే కాదు పోలీసుల రికార్డులు సైతం స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 6వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 24 గంటలు ఇళ్ల ద్వారాలు తెరిచే ఉండటం గమనార్హం. ఇతర ఊర్లకు వెళ్లే సమయంలో సైతం వీరు ఇంటికి గొళ్లెం కానీ, తాళాలు వేయరు. తాము ఎక్కడికి వెళ్లినా శనీశ్వరుడు తమ సందను కాపాడతాడని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. కాగా ఈ గ్రామం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన షిరిడి నగరానికి మరియు ఔరంగాబాద్ నగరానికి మధ్యలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed