- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Delhi: సీఎం రేఖా గుప్తా సారథ్యంలోని మంత్రుల విద్యార్హతలు ఏమిటో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: భారతీయ జనతా పార్టీ దాదాపు 27 ఏళ్ల తర్వాత తన కల సాకారం చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం (BJP Govt in delhi) కొలువుదీరింది. గురువారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సీఎంగా రేఖా గుప్తా.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, పంకజ్ కుమార్ సింగ్, రవీందర్ ఇంద్రజ్‌లకు శాఖలు కేటాయించారు. ఈ సందర్భంగా కొత్త సీఎం రేఖ గుప్తా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారి విద్యార్హతలేమిటో తెలుసుకుందాం.
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపికైన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మకు డిప్యూటీ సీఎంతో పాటు, విద్యా, ప్రజా పనులు, రవాణా శాఖలు కేటాయించారు. ఇక పర్వేష్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ కూడా ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ప్రవేశ్ వర్మ(Pravesh Verma) తన ప్రాథమిక విద్యను ఢిల్లీ ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బి.కామ్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఫర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎంబీఏ పట్టా పొందారు.
రాజౌరీ గార్డెన్ నియోజకవర్గం నుంచి ఎంపికైన మంజీందర్ సింగ్ సిర్సాకు ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు కేటాయించారు. ఇక ఈయన 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయనను అత్యంత ధనిక ఎమ్మెల్యే అని చెబుతుంటారు. మజీందర్ సింగ్(Majinder Singh) హర్యానాలోని సిర్సా నివాసి. ఆయనకు సిర్సాలో రూ.248 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
భావన నియోజకవర్గ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఇంద్రాజ్‌కు సాంఘిక సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాలు, కార్మిక శాఖలు కేటాయించారు. రవీందర్ సింగ్ ఢిల్లీ విశ్వ విద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు.
కారవాల్ నగర్ నియోజకవర్గం నుంచి ఎంపికైన కపిల్ మిశ్రాకు నీరు, పర్యాటకం, సంస్కృతి శాఖలు కేటాయించారు. కపిల్ మిశ్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సోషల్ వర్క్‌లో ఎంఏ చేశారు. ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు.
జనకపురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్‌కు రెవెన్యూ, పర్యావరణం, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖలు కేటాయించారు. ఆశిష్ సూద్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాల నుంచి బి.కామ్ పూర్తి చేశారు. ఈ సమయంలో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
వికాస్‌పురి ఎమ్మెల్యే పంకజ్ కుమార్ సింగ్‌కు చట్టం, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖలు కేటాయించారు. పంకజ్ కుమార్ వృత్తిరీత్యా దంత వైద్యుడు. బీహార్‌లోని బుద్ధగయలోని మగధ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) పూర్తిచేశారు.