కర్ణాటక సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయం: DK Shivakumar

by srinivas |
కర్ణాటక సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయం: DK Shivakumar
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై తర్జన భర్జన పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరూ కూడా సీఎం పీఠం కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ పంచాయితీ కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరింది. ఈ మేరకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ సిద్ధ రామయ్యతో తనకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్, ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని తాను అనుకుంటున్నానని డీకే శివకుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed