Karnakata Assembly : తెలంగాణ పథకాలపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ

by M.Rajitha |
Karnakata Assembly : తెలంగాణ పథకాలపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అమలు చేస్తున్న పథకాలపై కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly)లో నేడు వాడీ వేడిగా చర్చ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న 5 గ్యారంటీల అమలుకు ఏర్పాటు చేసిన సమితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలను నియమించటంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సమితుల్లో ఎమ్మెల్యేలను మానిటరింగ్ కోసం నియమించలేదని.. ప్రభుత్వ సొమ్మును కార్యకర్తల జేబులు నింపడానికి వాడుతున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కృష్ణప్ప(MP Krishnappa) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. హామీలను అమలు చేయడం ఎంత కష్టమో అధికారంలోకి వచ్చాక తెలుస్తుందని, ప్రభుత్వానికి వచ్చిన రాబడిలో అధిక శాతం వీటికే ఖర్చు చేస్తే.. రాష్ట్ర పాలన జరపడం కష్టమమని అన్నట్టు తెలిపారు.

ప్రతిఏటా రూ.18 వేల కోట్లు పింఛన్లు, వేతనాలకు చెల్లిస్తూ.. ఈ పథకాలను మోయటం కత్తి మీద సాము లాంటిదే అన్నట్టు గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో ఉన్న మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి స్వయంగా హామీల అమలుకు చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెబుతున్నపుడు.. మీరు మాత్రం హామీలను అమలు చేయడానికి సమితులకే ఏటా రూ.50 కోట్ల ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఏపీలో జగన్ సీఎం(AP Former CM Jagan) గా ఉన్నపుడు పథకాల అమలుకు వాలంటీర్లను నియమించి ప్రభుత్వ ధనాన్ని వృథా చేసిన విషయం దృష్టిలో పెట్టుకోవాలని ప్రతిపక్షాలు హితవు పలికాయి.

Next Story