మిజోరాంలో వాహనదారుల క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా

by Dishadaily Web Desk |
మిజోరాంలో వాహనదారుల క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : మిజోరాంలో వాహనదారుల క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదాట్రాఫిక్‌లో రెడ్ సిగ్నల్ పడిందంటే చాలు వాహనదారులందరూ రోడ్డంతా ఆక్రమించేసి.. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తుంటారు. మరికొందరైతే ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఇక కొందరైతే సిగ్నల్‌తో మాకేం పని అంటూ ట్రాఫిక్‌ను ఉల్లంఘిస్తుంటారు. అలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తూ దారిలోకి తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నా ఆశించినంతగా మార్పు రావడం లేదు. అయితే, మిజోరాంలో వాహనదారులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మిజోరాంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదారులందరూ ఒకే విధంగా లైన్ దాటకుండా క్రమశిక్షణతో ఉన్న ఫొటోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది వాహనదారులకు స్పూర్తిదాయకం అంటూ అభిప్రాయపడ్డారు. ఇలాంటి క్రమశిక్షణను మన జీవితంలో అలవరుచుకోవడం మన బాధ్యత అంటూ ట్వీట్ చేశారు. మహింద్రా చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Next Story