బెంగాల్ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల ధర్నా..కారణమిదే?

by vinod kumar |
బెంగాల్ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల ధర్నా..కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల చోప్రా, కూచ్‌బెహార్‌లలో మహిళలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మంగళవారం వరుసగా రెండో రోజూ నిరసన తెలిపారు. ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అగ్నిమిత్రపాల్ డిమాండ్ చేశారు. ‘ఈ రెండు ఘటనలే కాదు..రాష్ట్రంలో13 మూకదాడులు జరిగాయి. శాంతిభద్రతల పరిస్థితి క్షీణించింది. ముఖ్యంగా మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో చూపిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఈ నేరస్తులపై చర్యలు తీసుకునే వరకు అసెంబ్లీలోనే కూర్చుంటాం’ అని తెలిపారు.

అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించలేదని, కేవలం తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాత్రమే అనుమతించారన్నారు. నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేసినా వారు అతి త్వరలోనే విడుదల అవుతున్నారని, దీనిని పోలీసులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై జరిగిన రెండు మూకుమ్మడి హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మొదటి సంఘటన కూచ్ బెహార్ జిల్లాలో, మరొకటి ఇస్లాంపూర్‌లోని చోప్రాలో జరిగాయి. ఓ ఘటనలో మహిళపై దాడి చేయగా, మరో ఘటనలో ఓ జంటపై అటాక్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed