- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డెమో కుర్సీ.. డెమోక్రసీ కాదు - మోడీపై జైరాం రమేశ్ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాషాయపార్టీకి భారీ నష్టాన్ని మిగిల్చాయని ఎద్దేవా చేశారు. మోడీ 1/3వ వంతు ప్రధాన అని సెటైర్ వేశారు. అది మోడీ-చంద్రబాబునాయుడు-నితీష్ సర్కార్ అని చురకలు అంటించారు. మోడీ సంకీర్ణ సర్కార్‌ను నడపలేరని పేర్కొన్నారు. వారు కుర్చీ కోసం పాకులాడతారని, ప్రజాస్వామ్యం కోసం కాదని అన్నారు. వారు డమోక్రసీనికి కాదు. డమో కుర్సీని నమ్ముతారని ఫైర్ అయ్యారు. ఇక తమ పోరాటం అధికారం కోసం కాదని, ఎవరు ప్రధాని అవుతారనేది ప్రాధాన్యం కాదన్నారు. తమ ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్నికాపాడటమే అని స్పష్ట చేశారు.
ఎన్డీఏ పక్ష నేతగా మోడీ
కాగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల భేటీలో నరేంద్ర మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోడీని ఎన్డీయే నేతగా రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా, నితిన్ గడ్కరీ, అజిత్ పవార్, చంద్రబాబు, నితీష్ కుమార్, కుమారస్వామి సహా పలువురు నేతలు బలపరిచారు. మోడీకి అభినందనలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయనపై ప్రశంసలు కురిపించారు. 3 నెలల పాటు రెస్ట్ లేకుండా మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు బహిరంగ సభలు, ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి తమ కూటమి గెలుపు కోసం కృషి చేశారన్నారు.