ఎంత చెప్పినా వినకుండా రెజ్లర్లు చట్టాన్ని ఉల్లంఘించారు: ఢిల్లీ పోలీసులు

by Anjali |   ( Updated:2023-05-29 06:29:45.0  )
ఎంత చెప్పినా వినకుండా రెజ్లర్లు చట్టాన్ని ఉల్లంఘించారు: ఢిల్లీ పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు.. పార్లమెంట్ భవనం వైపు మార్చ్ చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు రెజ్లర్లను అదుపులోకి తీసుకున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. పార్లమెంట్ భవనం వైపు రెజ్లర్లు చేపట్టిన మార్చ్ సరికాదని.. వారిని తాము చాలా రిక్వెస్ట్ చేశామని.. అయినా కూడా వారు వినకుండా.. చట్టాన్ని ఉల్లంఘించినందునే వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే.. వారి సిట్‌ నిరసనను ముగించామని, రెజ్లర్లు తాజాగా సిట్‌ నిరసన కోసం దరఖాస్తు ఇస్తే, వారికి జంతర్‌మంతర్‌ కాకుండా వేరే స్థలం మంజూరు చేస్తామని పోలీసులు తెలిపారు.

Read more:

రెజ‌ర్లకు ఇచ్చే గౌర‌వం ఇదేనా.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ సీరియస్ (వీడియో)

Advertisement

Next Story

Most Viewed