లిక్కర్ స్కాం కేసులో సిసోడియాకు ఎదురుదెబ్బ

by GSrikanth |
లిక్కర్ స్కాం కేసులో సిసోడియాకు ఎదురుదెబ్బ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. మనీష్ సిసోడియాపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, అతడు శక్తివంతమైన వ్యక్తి కావడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ జస్టిస్ దినేషన్ కుమార్ శర్మతో కూడిన సింగిల్ బెంచ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. గత మార్చి 31న ఢిల్లీ ట్రయల్ కోర్టు సిసోడియా బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Next Story