ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదనలను ఆమోదించిన ఎల్జీ సక్సేనా.. వారికి 18 శాఖల కేటాయింపు..

by Vinod kumar |
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదనలను ఆమోదించిన ఎల్జీ సక్సేనా.. వారికి 18 శాఖల కేటాయింపు..
X

న్యూఢిల్లీ: మంత్రులు సిసోడియా, సత్యందేర్ జైన్‌ల రాజీనామాతో ఖాళీ అయిన 18 శాఖలను మంత్రులు కైలాష్ గహ్లట్, రాజ్‌కుమార్ ఆనంద్‌లకు కేటాయించాలని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కు ప్రతిపాదనలు పంపారు. దీనికి ఎల్జీ బుధవారం ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. కైలాష్‌కు 8 శాఖలు, ఆనంద్‌కు 10 శాఖలు కేటాయించాలని కేజ్రివాల్ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపారు. మంత్రులు సిసోడియా, సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేయడంతో అనివార్యమని తెలిపారు.

దీంతో గెహ్లట్‌కు ఆర్థిక, ప్రణాళిక, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, విద్యుత్, హోం, అర్బన్ డెవలప్ మెంట్, నీటిపారుదల-వరద నియంత్రణ, జల శాఖలను కేటాయించాలని కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నవాటికి వీటిని అదనంగా జోడించాలని తెలిపారు. మరోవైపు ఆనంద్ కు విద్య, ల్యాండ్ అండ్ బిల్డింగ్, విజిలెన్స్, సర్వీసెస్, టూరిజం, ఆర్ట్, కల్చర్ అండ్ లాంగ్వేజ్, లేబర్, ఉపాధి, ఆరోగ్యం, పరిశ్రమలను కేటాయించారు. మరోవైపు కేజ్రీవాల్ కొన్ని శాఖలు తన వద్దే ఉంచుకుంటారని భావించినప్పటికీ అలా జరగలేదు. ఇక ఆప్ ఎమ్మెల్యే లు సౌరభ్ భరద్వాజ్, అతిషిలను కూడా మంత్రులుగా పదోన్నతి కల్పించాలని ఎల్జీ ని కేజ్రీవాల్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed