గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు సమన్లు.. రూల్స్‌కి కట్టుబడి ఉండాలని హెచ్చరిక

by Mahesh |   ( Updated:2023-04-20 09:46:39.0  )
గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు సమన్లు.. రూల్స్‌కి కట్టుబడి ఉండాలని హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్‌ల కూతురు ఆరాధ్య బచ్చన్‌ తనపై వస్తున్న తప్పుడు వార్తలపై ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్‌ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు గూగుల్ సంస్థ, యూట్యూబ్ ఛానళ్లకు సమన్లు జారీ చేసింది. త‌క్ష‌ణ‌మే త‌మ ఫ్లాట్‌ఫామ్ నుంచి ఆ వార్త‌ల‌ను తొల‌గించాల‌ని ఆదేశించింది.

భ‌విష్య‌త్తులోనూ ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ను వ్యాప్తి చేయరాదు అని యూట్యూబ్‌ను హెచ్చ‌రించింది. ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. ఢిల్లీకి చెందిన యూట్యూబ్‌ ఛానళ్లలో 11 ఏళ్ల ఆరాధ్య ఆరోగ్యం గురించి ఇటీవ‌ల ఫేక్ న్యూస్ ప్రచారించారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌లు కోర్టును ఆశ్ర‌యించారు. ఆరాధ్యకు సంబంధించి తప్పుడు కంటెంట్ తొలగించాలంటూ 10 యూట్యూబ్ ఛానెళ్ల పేర్లను పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేసు విచార‌ణ స‌మ‌యంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ను హైకోర్టు నిల‌దీసింది. త‌ప్పుడు కంటెంట్‌ను పోస్టు చేయ‌కుండా ఉండే పాల‌సీలు ఏమీ లేవా అని కోర్టు యూట్యూబ్‌ను ప్ర‌శ్నించింది. యూజ‌ర్ల‌కు ఓ ఫ్లాట్‌ఫామ్ ఇచ్చేశాం, వాళ్లు ఏది పోస్టు చేసినా త‌మ‌కు బాధ్య‌త లేద‌న్న‌ట్లు యూట్యూబ్ వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదు అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఐటీ రూల్స్ ప్ర‌కారం త‌మ పాల‌సీల‌ను మార్చుకున్నారా లేదా అని ప్ర‌శ్నించింది. ప్ర‌తి చిన్నారికి గౌర‌వంగా, మ‌ర్యాద‌గా జీవించే హ‌క్కు ఉంద‌ని, ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్న యూట్యూబ్ పై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Read more:

కోహ్లీ కూతురితో డేటింగ్.. పేరెంట్స్‌ మూర్ఖులంటూ తిట్టిపోసిన కంగన

Advertisement

Next Story

Most Viewed