ఆప్ కు ఢిల్లీ హైకోర్టు షాక్.. ఆ ఎన్నికపై స్టే విధిస్తూ తీర్పు

by Javid Pasha |   ( Updated:2023-02-25 16:55:47.0  )
ఆప్ కు ఢిల్లీ హైకోర్టు షాక్.. ఆ ఎన్నికపై స్టే విధిస్తూ తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికపై ఢిల్లీ హైకోర్టు శనివారం స్టే విధించింది. ఈ నెల 27న స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఉంటుందన్న మేయర్ షెల్లీ ఒబెరాయ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శిఖా రాయ్, కమల్ జీత్ షేరావత్ అనే బీజేపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు చేపట్టిన హైకోర్టు.. స్టాండింగ్ కమిటీ ఎన్నికపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, మేయర్ షెల్లీ ఒబెరాయ్ కు నోటీసులు పంపింది.

51 నిబంధన ప్రకారం స్టాండింట్ కమిటీ ఎన్నికను నిర్ణయించే అధికారం మేయర్ కు లేదని నోటీసులో స్పష్టం చేసింది. స్టాండింగ్ కమిటీ ఓటింగ్‌కు సంబంధించి బ్యాలెట్ పేపర్లు, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సమాచారాన్ని భద్రపరచాలని మేయర్‌ను కోర్టు ఆదేశించింది. కాగా ఆరుగురు సభ్యులు గల స్టాండింగ్ కమిటీకి బీజేపీ నుంచి ముగ్గురికి, ఆప్ నుంచి ముగ్గురికి అవకాశం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. బీజేపీ ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్ దేవా స్టాండింగ్ కమిటీపై మేయర్ నిర్ణయాన్ని ఖండించారు. మేయర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed