- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేజ్రీవాల్‌కు జైలా.. బెయిలా ? తేలేది నేడే
దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేసి, రిమాండుకు తరలించడాన్ని సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ దీనిపై కీలక తీర్పును ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న 2వ నంబరు జైలులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. తనను ఈడీ అరెస్టు చేసిన సమయాన్ని కోర్టులో కేజ్రీవాల్ ప్రధానంగా లేవనెత్తారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తమ పార్టీని నీరుగార్చే ఉద్దేశంతోనే ఈవిధంగా అరెస్టు చేయించారని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఇదివరకే వాదనలు వినిపించారు. ఇక హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌ను సోమవారం ఉదయం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఇదంతా ‘పబ్లిసిటీ’ స్టంట్ అని.. పిటిషన్ దాఖలు చేసిన ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్‌ను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సందీప్ కుమార్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఈ పిటిషన్‌ను కూడా మంగళవారం రోజు విచారణ కోసం లిస్టు చేసింది.