Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం.. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి

by Shiva |   ( Updated:2025-02-08 08:56:48.0  )
Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం.. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Former CM Arvind Kejriwal) పరాజయం పాలయ్యారు. ఆయనపై సమీప బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Parvesh Varma) 4,089 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఈవీఎం (EVM) ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కాగానే.. మొదటి, రెండు రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Parvesh Varma) అధిక్యంలోకి వచ్చారు. అనంతరం మూడు, నాలుగు రౌండ్లలో మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ లీడ్‌లో కొనసాగారు. ఇక ఐదో రౌండ్ నుంచి చివరి వరకు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Parvesh Varma)తిరుగులేని అధిక్యాన్ని ప్రదర్శించారు. చివరకు 4,089 ఓట్ల తేడాతో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), పర్వేష్ వర్మ చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు.

Next Story