Delhi Election Results: పోస్టల్ బ్యాలెట్‌లో కమలనాథుల హవా.. సీఎం, మాజీ సీఎం వెనుకంజ

by Shiva |
Delhi Election Results: పోస్టల్ బ్యాలెట్‌లో కమలనాథుల హవా.. సీఎం, మాజీ సీఎం వెనుకంజ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ (Counting) ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం (Election Commission) అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 19 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతం సిబ్బంది అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల (Postal Ballot)ను లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో అధికార ఆమ్ఆద్మీ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. న్యూఢిల్లీలో స్థానం నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal), జంగ్‌పూరాలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia), కల్కాజీలో ఢిల్లీ సీఎం ఆతిశీ (Athishi) వెనుకంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌ (Postal Ballot)లో బీజేపీ (BJP) 16, ఆమ్‌ఆద్మీ (AAP) 11, కాంగ్రెస్ (Congress) ఒక స్థానంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

Next Story