- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్కసారిగా ఏడ్చేసిన CM కేజ్రీవాల్.. ఆయనను తలుచుకుని తీవ్ర భావోద్వేగం!
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించిన మనీశ్ సిసోడియా సేవలను తలుచుకుంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. బుధవారం ఔటర్ ఢిల్లీ బవానాలోని దిరియాపూర్ గ్రామంలో జరిగిన స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్‌లెన్స్ కార్యక్రమంలో ఆయన ఒక్కసారిగా భావోద్వోగానికి లోనయ్యారు. విద్యారంగంలో మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా చేసిన సేవలను, పడిన కష్టాన్ని తలుచుకుని ఆయన కంటతడి పెట్టారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిసోడియాపై బీజేపీ తప్పుడు కేసులు బనాయించి ఆయనను జైలులో పెట్టించిందని, ఆయన మంచి పాఠశాలలు నిర్మించకుండా ఉంటే బీజేపీ జైలులో పెట్టించేది కాదని కేజ్రీవాల్ అన్నారు. విద్యారంగంలో విప్లవానికి చరమగీతం పాడాలని వారు కోరుకుంటున్నారన్న ఆయన.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తాము తెరపడనీయమని స్పష్టం చేశారు.