ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కొత్త మంత్రి..

by Vinod kumar |
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కొత్త మంత్రి..
X

న్యూఢిల్లీ: మనీష్ సిసోడియా అరెస్ట్‌తో ఆర్థిక మంత్రిగా కైలాష్ గెహ్లట్‌కు ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. దీంతో ఈ సారి కైలాష్ గెహ్లట్ ప్రభుత్వం తరుఫున 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 17న సమావేశాలు ప్రారంభం కానుండగా, 21న ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెడుతారని అధికారులు తెలిపాయి.

లిక్కర్ స్కాంలో సిసోడియా అరెస్ట్ తర్వాత రెండు రోజులకే తమ పదవులకు సత్యేందర్ జైన్‌తో పాటు ఆయన రాజీనామా చేశారు. 2015లో ఆప్ అధికారంలోకి వచ్చన తర్వాత నుంచి సిసోడియానే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో ఆయన లేకుండానే తొలిసారి ఆప్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

Advertisement

Next Story