- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajnath Singh : మహిళలపై జరుగుతున్న నేరాలపై రాజ్ నాథ్ సింగ్ హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: అత్యాచార నిందితులకు శిక్షలు మరింత కఠిన తరం చేసేలా మా ప్రభుత్వం సవరణలు చేసిందని ఇలాంటి కేసుల్లో మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, నేరాలను చూస్తే ఎన్ని మార్పులు చేసినా ఇంకా చేయాల్సింది ఉందనిపిస్తోదన్నారు. శుక్రవారం తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మహిళలపై నేరాల పట్ల మా ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంభిస్తోంది, కానీ చాలా రాష్ట్రాలు ఈ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదన్నారు. ఇటీవల కోల్ కతాలో జరిగిన హృదయ విదారక సంఘటన చాలా బాధాకరమైనది అవమానకరమైనదన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో తయారు చేసిన రక్షణ పరికాలను కూడా ఎగుమతి చేస్తున్నామని 2023-24 సంవత్సరంలో భారత దేశ రక్షణ ఎగుమతి రూ. 21 వేల కోట్లు దాటిందని చెప్పారు. రక్షణ ఎగుమతులను రూ. 50 వేల కోట్లకు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు.