'దానా' తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

by M.Rajitha |
దానా తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రేపటి వరకు తుఫాన్ గా మారనుంది. కాగా ఈ తుఫానుకు ఐఎండీ 'దానా'(Dana Cyclone)గా నామకరణం చేసింది. దానా తుఫాన్ ఈ నెల 24న ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విపత్తును ఎదుర్కోడానికి ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్దంగా ఉన్నాయి. కాగా 'దానా' తుఫాన్‌ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, పర్బా మందిర్‌, మేదినీపూర్‌, పశ్చిమ మిడ్నాపూర్‌, ఝాగ్రామ్‌, బంకూర, హుగ్లీ, హౌరా, కోల్‌కతా జిల్లాల్లోని స్కూళ్లకు బెంగాల్ ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 26 వరకు సెలవు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed