- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమాజ్‌వాదీ పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండండి: మాయావతి హెచ్చరిక
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) పట్ల అప్రమత్తంగా ఉండాలని దళితులు, ఓబీసీలు, ముస్లింలను బీఎస్సీ (బహుజన్ సమాజ్ పార్టీ) అధినేత్రి మాయావతి హెచ్చరించారు. ఎస్‌పీ ప్రజల ప్రయోజనాలను వదిలేసి కుల రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు, తమ హక్కులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ తమతో కలుస్తున్నారని ఎస్‌పి అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పిన రెండ్రోజుల తర్వాత ఆమె ఈ ప్రకటన చేయడం గమనార్హం.
కాన్షీరామ్ స్థాపించిన బీఎస్సీ.. ఎస్‌పీతో కలిసి కూటమిగా ఏర్పడటంపై మాయావతి మాట్లాడుతూ.. ములాయం సింగ్ యాదవ్ ఆలోచనల్లో స్వచ్ఛత లేదన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బీఎస్సీని కించపరచడం, దళితులను అణచి వేయడం జరుగుతందని ఆమె ఆరోపించారు.
బీఎస్సీని 1984లో స్థాపించారు. మతపరమైన మైనార్టీలతో పాటు షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సి) షెడ్యూల్డ్ తెగలు ( ఎస్‌టి), ఇతర వెనకబడిన తరగతులకు (ఓబీసీఏ) బీఎస్సీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎస్‌పి అధ్యక్షుడి సమక్షంలో చేసిన ఓ నినాదంపై ఆ పార్టీ నేత రామచరితమానస్ వివాదంలో చిక్కుకున్నారు. ‘మిలే ములాయం-కాన్షీరాం... హవా హో గయే జై శ్రీరాం’ అని ఆయన చేసిన నినాదంపై కేసు నమోదైంది’ అని మాయావతి హిందీలో ట్వీట్ చేశారు. ‘నిజానికి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి ద్వేషపూరిత రాజకీయాలు చేయడమే ఎస్‌పీ ముఖ్య ఉద్దేశం’ అని ఆమె చెప్పారు.