సైరస్ పూనావాలాకు భారతరత్న ఇవ్వాలి: శరద్ పవార్ డిమాండ్

by samatah |
సైరస్ పూనావాలాకు భారతరత్న ఇవ్వాలి: శరద్ పవార్ డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత డాక్టర్ సైరస్ పూనావాలాకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ చీఫ్ శరద్ పవార్ డిమాండ్ చేశారు. పూణేలో పూనావాలాకు మోహన్ ధారియా రాష్ట్ర నిర్మాణ పురస్కార్ ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో పూనావాలా చేసిన కృషి మరువలేనిది. మొదట్లో ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీని ప్రదానం చేసింది. అనంతరం పద్మభూషణ్‌ను అందించింది. అతను భారతరత్నకు అర్హుడు కాబట్టి ప్రభుత్వం అతని గుర్తింపును పద్మభూషణ్ అవార్డుకు మాత్రమే పరిమితం చేయకూడదు. దేశం, ప్రపంచం మానవత్వం కోసం ఆయన చేసిన కృషికి ఆ గుర్తింపు అవసరం’ అని చెప్పారు. కాబట్టి వెంటనే పూనావాలకు భారతరత్న అవార్డు ప్రకటించాలని వెల్లడించారు. పూనావాలాను దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించడాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. కాగా, 1941లో మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన పూనావాలా.. 1966లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించి వ్యాక్సిన్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టాడు. వైద్య రంగంలో ఆయన చేసిన కృషి గాను 2005లో పద్మశ్రీ, కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో చేసిన కృషికి 2022లో పద్మభూషన్ పురస్కారం అందుకున్నారు.

Advertisement

Next Story