25 గ్రామాల్లో రాత్రి పూట కర్ఫ్యూ.. రాత్రి 7 అయ్యిందంటే బయటకు రావడం బంద్!

by samatah |
25 గ్రామాల్లో రాత్రి పూట కర్ఫ్యూ.. రాత్రి 7 అయ్యిందంటే బయటకు రావడం బంద్!
X

దిశ, వెబ్‌డెస్క్ : వన్య మృగాలు ఈ మధ్య ఎక్కువగా జనవాసాల్లోకి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనం ఎన్నో ఘటనలు చూశాం. పశువులపై దాడిచేసిన చిరుత పులి, పొలంలో పులి సంచారం ఇలా ఎన్నో ఘటనలు జరిగాయి. దీంతో ప్రజలందరూ భయాందోళనకు గురి అవుతున్నారు. రాత్రి అయ్యిందంటే చాలా బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు.

తాజాగా ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలో పెద్దపులి మనుషుల్ని చంపుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జిల్లా పరిధిలోని 25 గ్రామాలకు కర్ఫ్యూ విధించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలచేయనున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ ఆసీస్‌ చౌహాన్‌ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed