- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cruise missile: లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్.. డీఆర్‌డీఓ భారీ విజయం
దిశ, నేషనల్ బ్యూరో: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) భారీ విజయం సాధించింది. మొదటి సారిగా మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణి (LRLACM)ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి దీనిని పరీక్షించగా.. క్షిపణిలలోని అన్ని వ్యవస్థలు, ఉప వ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని, నిర్దేశిత లక్ష్యాలను చేధించగలిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వే పాయింట్ నావిగేషన్‌ను ఉపయోగించి క్షిపణి లక్ష్యాన్ని చేరుకుందని పేర్కొంది. రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి అనేక శ్రేణి సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది.
క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) డీఆర్‌డీఓను అభినందించారు. భవిష్యత్తులో స్వదేశీ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఎల్ఆర్ఎల్ఏసీఎంను డీఆర్‌డీఓ లాబొరేటరీలు, భారతీయ పరిశ్రమల సహకారంతో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అభివృద్ధి చేసింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరులు సైతం ఈ క్షిపణి అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. ఈ క్షిపణి పరీక్ష సమయంలో డీఆర్‌డీఓ ప్రయోగశాలల నుంచి అనేక మంది సీనియర్ శాస్త్రవేత్తలు, త్రివిధ దళాల ప్రతినిధులు పర్యవేక్షించారు.
చైనా, పాక్‌ల ఆందోళన!
ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో చైనా, పాక్‌ల ఆందోళన పెరగడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది యాంటీ షిప్ బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణి. దీనికి 1000 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. అంటే 1000 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ దూరంలో ఉన్న యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలను ఢీకొనే సామర్థ్యం కలిగి ఉంటుంది. హిందూ మహాసముద్రం నుంచి అరేబియా మహాసముద్రం వరకు, చైనా నుంచి పాకిస్థాన్ వరకు లక్ష్యంగా చేసుకుని దాడి చేయొచ్చు. యుద్ధ నౌకలు, తీర ప్రాంతాల నుంచి కూడా దీనిని పరీక్షించొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనిని భారత నౌకాదళానికి అందజేయనున్నట్టు తెలుస్తోంది.