PM Modi: ప్రధాని మోడీని కలిసేందుకు భారత్‌కు చేరుకున్న అబుదాబి యువరాజు

by S Gopi |
PM Modi: ప్రధాని మోడీని కలిసేందుకు భారత్‌కు చేరుకున్న అబుదాబి యువరాజు
X

దిశ, నేషనల్ బ్యూరో: అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన మొదటి అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆదివారం ప్రిన్స్ న్యూఢిల్లీ చేరుకున్నారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌గా జాయెద్ అల్ నహ్యాన్ భారత్‌కు రావడం ఇది మొదటిసారి. ఆయనతో పాటు యూఏఈ ప్రభుత్వం నుంచి పలువురు మంత్రులు, వ్యాపార ప్రతినిధుల బృందం కూడా వచ్చింది. షెడ్యూల్‌లో భాగంగా సెప్టెంబర్ 9న ప్రధాని మోడీని కలవనున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరపనున్నారు. అలాగే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి రాజ్‌ఘాట్‌లోని మహాత్మ గాంధీకి నివాళులర్పించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 10న ముంబైలో జరగనున్న బిజినెస్ ఫోరమ్‌ సదస్సులో పాల్గొంటారు.

Advertisement

Next Story