- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JP Nadda : మాలీవుడ్ లైంగిక వేధింపుల కేసులో కేరళ సీఎం ఏదో దాస్తున్నారు : జేపీ నడ్డా
దిశ, నేషనల్ బ్యూరో : మాలీవుడ్ లైంగిక వేధింపుల కేసులో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని కేరళ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏదో దాస్తున్నారని.. సీపీఎం నేతల ప్రమేయం ఉన్నందునే చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివారం కేరళలోని పాలక్కడ్‌లో వివిధ రంగాల ప్రముఖులతో జరిగిన సమావేశంలో నడ్డా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మాలీవుడ్ లైంగిక వేధింపుల కేసులో సీపీఎం నేతల ప్రమేయం ఉందని హేమ కమిటీ నివేదికలో ప్రస్తావించారని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలి’’ అని నడ్డా కోరారు. ‘‘హేమ కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోకుండా కేరళ ప్రభుత్వాన్ని ఆపుతున్నది ఎవరు ? మీరు దానిలో భాగం కాబట్టే చర్యలు తీసుకోవడం లేదు. మీ పార్టీ(సీపీఎం) నేతల ప్రమేయాన్ని దాచాలని అనుకుంటున్నారు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు పేర్కొన్నారు.