ఆవును జాతీయ జంతువుగా గుర్తించడంపై కేంద్రం క్లారిటీ..

by Vinod kumar |
ఆవును జాతీయ జంతువుగా గుర్తించడంపై కేంద్రం క్లారిటీ..
X

న్యూఢిల్లీ : ఆవును జాతీయ జంతువుగా గుర్తించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోందా అని బీజేపీ ఎంపీ భగీరథ్ చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు లోక్ సభలో సమాధానం ఇచ్చారు. 'జాతీయ జంతువు'గా పులిని, 'జాతీయ పక్షి'గా నెమలిని 1972 వన్యప్రాణుల (రక్షణ) చట్టంలోని షెడ్యూల్-I నోటిఫై చేసిందని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed