భారీగా పెరిగిన కరోనా కేసులు..

by Mahesh |   ( Updated:2023-03-30 05:06:47.0  )
భారీగా పెరిగిన కరోనా కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుగు పెరుగుతూ పోతుంది. నిన్న ఒక్కరోజే 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 3,016 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం భారతదేశంలో 13,016 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు భారతదేశంలో ఇప్పటివరకు 5,30,862 COVID-19 మరణాలు నమోదు కాగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,41,68,321కి చేరుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ఈ కేసుల సంఖ్య అలాగే పెరిగి మరోసారి కల్లోలం సృష్టించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed