వీధికుక్కల పట్ల సానుభూతి చూపడంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Vinod kumar |
వీధికుక్కల పట్ల సానుభూతి చూపడంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

బెంగుళూరు: వీధికుక్కల పట్ల సానుభూతి చూపడంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాటకి తిండి పెట్టడం వల్ల ప్రజలు ప్రమాదంలో పడకూడదని పేర్కొంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డు మార్గదర్శకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ జాప్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పీఐఎల్) విచారిస్తూ ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘కుక్కలకు ఆహారం అందించేవారు.. తమ చర్యలు తోటి పౌరులకు ఆటంకం లేదా ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండేలా చూసుకోవాలి’ అని చీఫ్ జస్టిస్ ప్రసన్న బి. వరాలే, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది. నిర్దేశించని ప్రదేశాల్లో జంతువులకు ఆహారం ఇవ్వడం వల్ల ఆరోగ్య, ఇతరత్రా సమస్యలు తలెత్తుతాయని కోర్టు పేర్కొంది.

అంతేకాదు వీధి కుక్కలకు ఆహారం ఇస్తున్న పౌరులు ఎవరూ వాటికి స్టెరిలైజేషన్ లేదా టీకాలు వేయడంలో ప్రభుత్వ సంస్థలకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించింది. కుక్కల పట్ల సానుభూతి చూపడంలో తమకు అభ్యంతరం లేదన్న కోర్టు.. బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టడం మాత్రం పాఠశాలకు వెళ్లే పిల్లల మనస్సుల్లో కొంత భయాన్ని కలిగిస్తుంది. కొన్ని వీధి కుక్కలు స్కూల్‌కు వెళ్లే పిల్లల వైపు దూసుకుపోయే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని పేర్కొంది.

Advertisement

Next Story