కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

by GSrikanth |
కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కేజ్రీవాల్ తరపు, ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు.. అనూహ్యంగా తీర్పు రిజర్వ్ చేసింది. కాగా, కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా కేజ్రీవాల్‌ను ఈడీ ఆఫీసుకు తరలించనున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిసరాల్లో భద్రతను భారీగా పెంచారు. కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. ఈడీ కార్యాలయం వెలుపల కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ పిలుపునిచ్చిన ఆందోళనల్లో ఇండియా కూటమి పార్టీలు కూడా పాల్గొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed