- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేసిన పాపాలకు కాంగ్రెస్ శిక్ష అనుభవిస్తోంది: ప్రధాని మోడీ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడి ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శల తీవ్రతను పెంచారు. ఆదివారం రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా భిన్మల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. కాంగ్రెస్ తాను చేసిన పాపాలకు దేశం శిక్షిస్తోంది. ఒకప్పుడు 400 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 300 స్థానాల్లో కూడా పోటీ చేయలేకపోతోందని అన్నారు. 'మొదటి దశ ఓటింగ్‌లో రాజస్థాన్‌లో సగం మంది ప్రజలు కాంగ్రెస్‌ను శిక్షించింది. దేశభక్తితో నిండిన రాజస్థాన్ కాంగెస్ ఎన్నటికీ భారత్‌కు శక్తివంతం చేయదని తెలుసు. 2014కు ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలని దేశం కోరుకోవడంలేదని మోడీ తెలిపారు. పక్షపాతం, అవినీతి లాంటి చెదలతో దేశాన్ని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్‌పై దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారి పాపాలకు శిక్ష విధించి అధికారానికి దూరం పెట్టారని మోడీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని, గతంలో 400 సీట్లు గెలిచిన వారు ఇప్పుడు 300 చోట్ల సొంతంగా పోటీ చేయలేకపోతోందని అన్నారు. కాగా, రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ నెల 19న మొదటి దశలో భాగంగా 12 స్థానాలకు పోలింగ్ జరగ్గా, మిగిలిన 13 స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్ జరగనుంది.