- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
President Droupadi Murmu: కోరమండల్ రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం..
దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ ప్రమాదంపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటన జరగడం దురుదృష్టకరమని అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
ఇక, శుక్రవారం రాత్రి హౌరా నుండి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఒడిషాలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 233 మంది మరణించగా.. దాదాపు 1000 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. మరో 600 మంది ప్రయాణికులు రైలు బోగీల్లోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనలో స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read...
ఘోర విషాదం.. కోరమాండల్ రైలు ప్రమాదంలో 233కు చేరుకున్న మృతుల సంఖ్య