- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదాల ట్రైనీ ఐఏఎస్..! పూజా వ్యవహారంలో మరో ట్విస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించి మరిన్ని వివాదాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఉద్యోగంలో చేరేందుకు ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, 2022లో ఢిల్లీ ఎయిమ్స్ తనకు కళ్లు, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలు ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐఏఎస్‌కు ఎంపిక చేసే సమయంలో తప్పనిసరిగా నిర్వహించే వైద్య పరీక్షలకు ఆమె డుమ్మా కొట్టారని తెలిసింది. ఆరు సార్లు వైద్యపరీక్షలకు పిలువగా.. చివరికి ఆమె పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు దృష్టి లోపాన్ని నిర్ధారించే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేని తెలిసింది. కానీ ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్ పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యునల్లో సవాల్ చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కానీ తన నియామకాన్ని కన్‌ఫర్మ్ చేసుకుంది. మరోవైపు పూజా ఓబీసీ ధ్రువీకరణ పైనా వివాదాలు ఉన్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841 వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ హోదా లభించింది.
ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రొబేషన్ కాలం పూర్తి కానీ ఆమె.. తన కారుపై రెడ్, బ్లూ సిగ్నల్ లైట్లను ఉపయోగించడం, కారుపై మహారాష్ట్ర గవర్నమెంట్ అని రాసుకోవడం చేసింది. అంతేగాక అదనపు కలెక్టర్ అజయ్ మోర్ విధుల్లో లేని సమయంలో ఆయన చాంబర్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న ఫర్నీచర్‌ను తొలగించడం లాంటి పనులు చేసింది. మరోవైపు ఆమెకు తన పేరుపై లెటర్ హెడ్, నేమ్ ప్లేట్‌తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కార్యాలయంపై ఒత్తిడ తెచ్చినట్లు నివేదికలు వచ్చాయి.
ఈ ఉల్లంఘనలు తన దృష్టికి రావడంతో పూణే కలెక్టర్ సుహాస్ దివాసే మహారాష్ట్ర స్టేట్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం ఆమెను వాషిమ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో పూజా తన మిగిలి ఉన్న ప్రొబేషన్ కాలాన్ని వాషిమ్ జిల్లా సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పూర్తి చేయనున్నారు. అయితే, తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి రావడంతో ఆమెపై ప్రభుత్వం ఎలాంటి చర్చలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.