- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎగ్జిట్ పోల్స్ విషయంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల తుదిదశ పోలింగ్ శనివారం జరగనుంది. సాయంత్రం 5 తర్వాత ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతున్నాయి. ఇదిలా ఉంటే, ఎగ్జిట్ పోల్స్ విషయంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనవద్దని నిర్ణయం తీసుకుంది. టీఆర్పీల కోసం ఊహాగానాల్లో మునిగిపోవద్దని తెలిపింది. ఈవిషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మీడియా విభాగం ఛైర్ పర్సన్ పవన్ ఖేరా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని.. వారి తీర్పు ఖాయమైందన్నారు. జూన్ 4న ఫలితాలు రానున్నాయన్నారు. టీఆర్పీల కోసం ఊహగానాలు, స్లగ్ ఫెస్ట్ లో మునిగిపోవడానికి ఎలాంటి కారణం కన్పించట్లేదన్నారు. కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ పై చర్చల్లో పాల్గొనదని స్పష్టం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించడమే ఏదైనా చర్చ ఉద్దేశమని.. జూన్ 4 నుంచి చర్చల్లో పాల్గొంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.