- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుంభమేళాలో స్నానం చేస్తే విముక్తి రాదు.. ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Congress President Mallikarjun Kharge) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) క్షమించరాని తప్పులు చేశారని.. అలాంటి వ్యక్తులు కుంభమేళా(Mahakumbh)లో స్నానాలు చేస్తే విముక్తి రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా మోడీ, అమిత్ షా నరకానికి వెళ్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని మోడీ విర్రవీగాడు.
తీరా చూస్తే పొత్తు లేకపోతే దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం మోడీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(AP CM Chandrababu), బిహార్ ముఖ్యమంత్రి నితీష్(Bihar CM Nitish) చేతుల్లో ఉందని అన్నారు. ఎన్డీఏ నుంచి ఆ ఇద్దరు తప్పుకుంటే మోడీ సర్కార్ పతనం ఖాయమని తెలిపారు. కాగా, ఈ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి అమిత్ షా మహాకుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షాకు సాధువులు తిలకం దిద్దారు. ఆయనతోపాటు ఆయన చిన్నారి మనవడి(ICC చైర్మన్ జై షా కుమారుడు)కి కూడా సాధు సంతువులు తిలకం దిద్దారు.
ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి అమిత్ షా అర్చన చేసి గంగా హారతి ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో ఇది 15వ రోజు. ఇప్పటికే కుంభమేళాకు 13 కోట్లకుపైగా భక్తులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోడీ రాబోతున్నారు. దానికి ముందే ఇవాళ ప్రయాగ్‌రాజ్‌కు అమిత్ షా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, సహా 73 దేశాల దౌత్యవేత్తలు సైతం ఫిబ్రవరి 1న కుంభమేళాలకు వస్తున్నారు.