- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అబద్ధాల పుట్ట : బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఒక అబద్ధాల పుట్ట అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలేవీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని ఆయన గుర్తు చేశారు. ‘‘కాంగ్రెస్ నిజంగానే అత్యంత పురాతన పార్టీ. ఎందుకంటే.. ప్రస్తుతం తమ చుట్టూ ఏం జరుగుతోందో ఆ పార్టీ తెలుసుకోలేకపోతోంది’’ అని సెటైర్స్ వేశారు. సుధాన్షు త్రివేది శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకే మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. కాంగ్రెస్ హయాంలో దవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. వృద్ధి రేటు తక్కువగా ఉంటుంది. మహిళలకు నగదు విషయంలో రాహుల్ గాంధీది ఒక మాట. ఖర్గేది ఒక మాట. ఇవన్నీ తప్పుడు హామీలే’’ అని చెప్పారు. మన దేశం కోసం తయారు చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో విదేశాల్లోని పలు ప్రాంతాల ఫొటోలను కాంగ్రెస్ పార్టీ వాడటం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లోని బఫెలో రివర్, థాయ్‌లాండ్ ఫొటోలను మేనిఫెస్టోలో ఎందుకు వాడారని ప్రశ్నించారు.