- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ పార్టీ 80 సార్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది: నితిన్ గడ్కరీ
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని, వారు ఇప్పటి వరకు 80 సార్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని నితిన్ గడ్కరీ అన్నారు. మహారాష్ట్రలోని రామ్‌టెక్‌లో ఎన్నికల ర్యాలీలో గడ్కరీ మాట్లాడుతూ, "గత 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని మా ప్రభుత్వం కేవలం 10 ఏళ్లలో చేసింది. కులం, మతం, భాష, ధర్మం వల్ల ఎవరూ పెద్దవారు కాదని, గుణాల వల్ల గొప్పవారు అని మేము నమ్ముతున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం చూసిన అభివృద్ధి వల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని” కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన గడ్కరీ ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పార్టీ ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. మోదీ, బీజేపీ తమ అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. మేము వారి వారి కోరికల మేరకు పనిచేస్తున్నాము. వారు బీజేపీకి ఓటు వేస్తారని నేను చాలా సానుకూలంగా, నమ్మకంగా ఉన్నానని గడ్కరీ తెలిపారు.