Diwali Rush: ప్రయాణికుల బాధను పట్టించుకోరా?: రాహుల్ గాంధీ

by Y.Nagarani |   ( Updated:2024-10-30 03:57:00.0  )
Diwali Rush: ప్రయాణికుల బాధను పట్టించుకోరా?: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: పండుగలు వచ్చాయంటే చాలు.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి మొదలు.. ఉగాది, వినాయకచవితి, దసరా, దీపావళి.. ఈ పండుగలకు మాత్రం ప్రయాణికులు సొంతూళ్లకు క్యూ కడతారు. రిజర్వేషన్లు అందరికీ దొరకవు కాబట్టి.. రైలులో జనరల్ కంపార్టుమెంట్లతో పాటు.. స్లీపర్ క్లాస్ బోగీల్లోనూ కిక్కిరిసి ఉంటారు. ఊపిరి తీసుకునే ఖాళీ అయినా ఆ రైలు పెట్టెలో ఉంటుందా అన్నట్టే ప్రయాణిస్తుంటారు. కొందరు డోర్లు పట్టుకుని వేలాడుతూనే వెళ్తుంటారు.

రైలులో కిక్కిరిసి వెళ్తున్న కూలీల కష్టాలపై కాంగ్రెస్ షేర్ చేసిన వీడియోను ఉద్దేశించి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీపావళికి (Diwali 2024) కోట్లాది మంది భారతీయులు తమ కుటుంబాలను కలిసేందుకు రైల్లో ప్రయాణిస్తారు. కూలీల నుంచి పారిశ్రామిక వేత్తల వరకూ ప్రతి భారతీయుడు రైల్వే మార్గాన్ని (Indian Railways) అనుసరిస్తారు. కానీ.. అందరికీ అందుబాటులో ఉండాల్సిన రైల్వే సౌకర్యాలు దెబ్బతిన్నాయన్నారు రాహుల్ గాంధీ. పేదలను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే వ్యవస్థ.. ఇప్పుడు వారి అవసరాల్ని తీర్చలేకపోతోందన్నారు. రైల్వే వ్యవస్థలో ఉన్న లోపాలను, దానిని మరింత మెరుగుపరిచేందుకు మీరు కూడా మీ సూచనలు, అనుభవాలను మాకు చెప్పండని రాహుల్ గాంధీ నెటిజన్లను కోరారు.

Advertisement

Next Story