- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశాన్ని బలోపేతం చేయడమే కాంగ్రెస్ మేనిఫెస్టో లక్ష్యం: ఫరూక్ అబ్దుల్లా ప్రశంసలు
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన మేనిఫెస్టోపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రశంసల వర్షం కురిపించారు. ఆ మేనిఫోస్టో దేశాన్ని బలోపేతం చేయడం, లౌకిక ప్రమాణాలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని కొనియాడారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ ముద్ర అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఏంటని అడిగిన ప్రశ్నకు ఫరూక్ స్పందిస్తూ.. ఇలాంటి మాటలు మాట్లాడేవారు దేశాన్ని కాపాడలేరని తెలిపారు. వారంతా ఇప్పటికే దేశాన్ని తమ దైన శైలిలో విభజించారని అన్నారు. పీపీడీ ఛీఫ్ ముఫ్తి ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. కశ్మీర్ ప్రజలకు తమ పార్టీ గురించి పూర్తిగా తెలుసని లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా ఆదరిస్తారని స్పష్టం చేశారు. కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది.