- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంద మంది మోడీలు రానివ్వండి.. మాదే అధికారం : మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ: కూటమితో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేపడుతుందని.. 2024 ఎన్నికల్లో ప్రజలు బీజేపీని పక్కన పెడతారని మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని పార్టీలతో చర్చిసున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. 'దేశాన్ని సమర్థవంతంగా నడిపించగల వ్యక్తిని నేను మాత్రమే. నన్నెవ్వరూ తాకలేరు అని ప్రధాని నరేంద్ర మోడీ చాలాసార్లు చెప్పారు. ప్రజాస్వామివాది ఎవ్వరూ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరు. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా..? మీరు నియంత కాదన్న విషయన్ని గుర్తుంచుకోవాలి. మీరు ప్రజలచే ఎన్నకోబడ్డారు. ప్రజలే మీకు సరైన గుణపాఠం చెబుతారు' అని నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే అన్నారు.
'2024లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ఆ కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది. మిగతా పార్టీలతో చర్చిస్తున్నాం. లేదంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కనుమరుగైపోతాయి' అని ఖర్గే చెప్పారు. 'అందుకే ప్రతి పార్టీతో అప్పుడప్పుడు కలుస్తున్నాం. మాట్లాడుతున్నాం. అభిప్రాయాలు పంచుకుంటున్నాం. బీజేపీకి మెజార్టీ రాదు. మిగతా పార్టీలన్నీ మెజార్టీ సాధిస్తాయి. వంద మంది మోడీలు లేదా అమిత్ షాలు వచ్చినా ఎదుర్కొంటాం' ప్రధానిని, ఆయన ప్రధాన వ్యూహకర్త, హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఖర్గే అన్నారు.
'స్వాతంత్ర్యం కోసం మా వాళ్లు (కాంగ్రెస్) ప్రాణాలు అర్పించారు. మీరుకాదు. బీజేపీ వాళ్లూ మీరు చెప్పండి.. బీజేపీకి చెందిన ఏ నాయకుడినైనా స్వాతంత్ర్యం కోసం ఉరి తీశారా? లేదా స్వాతంత్ర్యం కోసం పోరాడారా..? కనీసం జైలుకు వెళ్లారా..? బదులుగా స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీని వాళ్ల వాల్లే చంపారు. ఇటువంటి వాళ్లు కూడా దేశ భక్తి గురించి మాట్లాడుతున్నారు' అని బీజేపీపై ఖర్గే నిప్పులు చెరిగారు.