- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిన్న పిల్లలకు షేక్ హ్యాండ్ ఇవ్వని మోడీ.. విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోదీ ఈ దేశాన్ని పాలించే వ్యక్తి. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడపాల్సిన వ్యక్తి. దేశ ప్రజలను కూడా సమానంగా చూడాల్సి వ్యక్తి. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా పాలించాల్సి వ్యక్తి. అయితే ఎందుకో కానీ చిన్న పిల్లల విషయంలో ఆయన తాజాగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇందులో భాగంగా స్థానిక నేతలతో కలిసి పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తు్న్నారు. స్థానిక నేతలను పక్కన పెట్టుకుని ఓట్లు అభ్యర్థిస్తు్న్నారు. మంగళవారం కలబురగిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో ముచ్చటించారు. అయితే ముళ్ల ఫెన్సింగ్ అవతల చిన్నారులు.. ఇవతల ప్రధాని మోదీ ఉన్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ చిన్నపిల్లలతో మాట్లాడారు. నవ్వుతూ చేతులు ఊపారు. ఎలా ఉన్నారు, బాగా చదువుతున్నారని అప్యాయంగా అడిగారు. సరదాగా కాసేపపు వారితో ఆట ఆడారు.
అయితే, ప్రధాని మోదీకి చిన్న పిల్లలు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ ప్రధాని మోదీ మాత్రం వారికి చేయి ఇవ్వలేదు. వారి చేతులకు దూరంగా తన చేయిని ఊపుతూ పలకించారు. మరోవైపు మోదీ సిబ్బంది చిన్నపిల్లల చేతులను వెనక్కు నెట్టేశారు. ఎదురుగా ఇనుప తీగ ఉంది. అయినా పట్టించుకోకుండా చిన్న పిల్ల చేతులు ప్రధాని దగ్గరకు రానీయకుండా చేశారు. దాంతో చిన్న పిల్లలు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు.
ఫెన్సింగ్‌ను సైతం లెక్క చేయకుండా ప్రధాని మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఆయన చేతిని మాత్రం తాకలేకపోయారు. చిన్న పిల్లల పట్ల ఎవరైనా సరే ఎంతో అపాయ్యత చూపుతారు. కానీ ప్రధాని మోదీ మాత్రం తన భద్రత దృష్ట్యా చిన్న పిల్లలకు కనీసం షేక్ ఇవ్వకపోవడాన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు పలువురు తప్పుబడుతున్నారు. అదే రాహుల్ గాంధీ అయితే తన పాదయాత్రలో చిన్న పిల్లలతో కలిసి క్రికెట్ ఆడారు. వారితో సరదాగా గడిపారు. ఈ వీడియోలను పోస్ట్ చూస్తే కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తు్న్నారు.
చిన్నపిల్లలను దేవుళ్లతో సమానమని, అలాంటి వారిని అంటరానివారిగా చూసిన ప్రధానిని ఈ ఎన్నికల్లో ఓడించాలని పోస్టులు పెడుతున్నారు. అటు నెటిజన్లు సైతం మోదీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేనప్పుడు.. వాళ్లను ఎందుకు పిలవడం, వారి పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించడం ఎందుకు అని విమర్శలు కురిపిస్తున్నారు. ప్రధాని భద్రత ఎంతో ముఖ్యమైనా.. చిన్నపిల్లలను చెక్ చేసిన తర్వాతే కదా.. మోదీ వద్దకు పంపారని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఇది కదా బీజేపీ వాళ్లకు చిన్న పిల్లల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని పలువురు రాజకీయ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. మరీ వీటన్నింటిపై బీజేపీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.