- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: పరువు నష్టం కేసులో ఎంపీ పదవిని కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ లోని అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. 2019 నాటి పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించగా.. దాన్ని ఆధారంగా చేసుకొని లోక్ సభ ఆయనను ఎంపీ పదవి నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22 వరకు అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్ సభ హౌజింగ్ కమిటీ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే శనివారం రాహుల్ గాంధీ తనకు కేటాయించిన అధికార నివాసాన్ని ఖాళీ చేసి.. అందులోని వస్తువులను తన తల్లి సోనియాగాంధీ నివాసమైన 10 జన్ పథ్ కు తరలించారు. 2004 నుంచి రాహుల్ గాంధీ 12 తుగ్లక్ లేన్ లోని బంగ్లాలో ఉంటున్నారు. దాదాపు 19 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ ఈ బంగ్లాను ఖాళీ చేశారు.
Advertisement
Next Story