- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రధానిని విమర్శించడమే కాంగ్రెస్ పని: అయోధ్య ఆలయ ప్రధాన పూజారి
దిశ, నేషనల్ బ్యూరో: 500 ఏళ్ల తర్వాత మనువాదులు మళ్లీ వచ్చారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ జీ మహారాజ్ స్పందించారు. ప్రధాని మోడీ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ కోసం పని చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం పీఎంను విమర్శించడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వారు ఎంత ప్రయత్నించినా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. ఎందుకంటే హస్తం పార్టీ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆరోపించారు. 2024లోనూ తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావడం ఖాయమని తెలిపారు. జనవరి 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవానికి పనులు ముమ్మరంగా సాగుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు, ఉదిత్ రాజ్ తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. తాను రామాలయాన్ని వ్యతిరేకించడం లేదని తెలిపారు. మనువాదుల గురించి ప్రస్తావిస్తే..బీజేపీ అనుకూల మీడియాకు ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. నేను చేసిన ట్వీట్‌ను మరోసారి చూడాలని సూచించారు.