కాంగ్రెస్ కశ్మీర్‌ను తప్పుదారి పట్టిస్తోంది: ప్రధాని మోడీ విమర్శలు

by samatah |
కాంగ్రెస్ కశ్మీర్‌ను తప్పుదారి పట్టిస్తోంది: ప్రధాని మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్ పార్టీ కశ్మీర్‌ను తప్పుదారి పట్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. గురువారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన మోడీ రూ. 6400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్తగా నియామకమైన 1000 మంది ప్రభుత్వ ఉద్యో్గస్తులకు అపాయింట్ లెటర్ అందజేశారు. అనంతరం శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కొన్ని కుటుంబాలు జమ్మూ ప్రజలనే గాక దేశం మొత్తాన్ని వక్రమార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కశ్మీరీలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త కశ్మీర్ ప్రస్తుతం చూస్తున్నారని తెలిపారు. గతంలో జమ్మూ కశ్మీర్ బంధుప్రీతి, అవినీతికి బలి అయిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే కశ్మీర్ ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చారని చెప్పారు. 2019 ఆగస్టు 5 న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత మోడీ శ్రీగర్ లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

Advertisement

Next Story