Jharkhand Elections : కాంగ్రెస్ విభజించే రాజకీయం చేస్తోంది : మోడీ

by M.Rajitha |
Jharkhand Elections : కాంగ్రెస్ విభజించే రాజకీయం చేస్తోంది : మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : జార్ఖండ్(Jharkhand) లోని రాంచీలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కాంగ్రెస్ పార్టీపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ లో కాంగ్రెస్-జేఎంఎం(Congress-JMM) కలిసి ఓబీసీ(OBC)లను విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆ రెండు పార్టీలు అధికారాన్ని చేజిక్కుంచుకోడానికి ఎంతకైనా దిగజారుతాయని, ప్రజలు ఐక్యంగా ఉండి వారిని ఎదుర్కోవాలని మోడీ సూచించారు. గత ఏడు దశాబ్దాలుగా దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఉపకులాలను ఇరకాటంలో పెట్టి రాజకీయ లబ్ది పొందాలని కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు చూస్తున్నాయని.. వారి ఆటలు సాగకూడదు అంటే జార్ఖండ్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. తాము రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత జేఎంఎం పాలనలో జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మోడీ హెచ్చరించారు.

Advertisement

Next Story